Wed. Apr 22nd, 2026

యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన మరో ఆసక్తికర సినిమాలో నటిస్తున్నాడు. దర్శకుడు జానకిరామ్ మారెళ్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను దసరా సందర్భంగా అనౌన్స్ చేశారు.

పూర్తి యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు ‘కామ్రేడ్ కళ్యాణ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నక్సలైట్‌గా శ్రీవిష్ణు నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాను కోన వెంకట్ ప్రొడ్యూస్ చేస్తుండగా మహిమ నంబియార్, రాధిక శరత్ కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The put up తుపాకీ పట్టిన శ్రీవిష్ణు.. లాల్ సలామ్ అంటున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.