Wed. Apr 22nd, 2026

‘లూసియా’ ఫేమ్ సతీష్ నినాసం హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. వినోద్ వి ధోండలే దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ సినిమాలో ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘వినరా మాదేవ’ అంటూ సాగే మొదటి పాటను మేకర్స్ విడుదల చేశారు.

శివుడి గొప్పతనాన్ని, భక్తుల ఆరాధనను కళ్ళకు కట్టేలా సాగే ఈ జాతర పాట ఆకట్టుకుంటోంది. శ్రీనివాస్ కాళే అందించిన సాహిత్యం, సంతు మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు ప్రధాన బలంగా నిలిచాయి. గ్రాండియర్ సెట్స్, విజువల్స్‌తో పాటు సప్తమి గౌడ లుక్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. హీరో సతీష్ నినాసం, సాద్విని కొప్ప, సిద్దులు సంయుక్తంగా ఈ గీతాన్ని ఆలపించారు.

వృద్ది క్రియేషన్, సతీష్ పిక్చర్ హౌస్ బ్యానర్లపై వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నినాసం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లహరి మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో విడుదలైంది. నిర్మాణ కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The publish ‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి ‘వినరా మాదేవ’ సాంగ్ రిలీజ్ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.