ఇప్పుడు ప్రపంచ ఓటిటి ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది దిగ్గజ స్ట్రీమింగ్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి రానున్న స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అనే చెప్పాలి. గ్లోబల్ వైడ్ గా మొదటి నాలుగు సీజన్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్నో ఏళ్ళు నుంచి ఎదురు చూస్తున్న ఆఖరి సీజన్ ఈ 2025 ఏడాది ముగింపుగా నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేసింది.
దీనితో మరింత ఎగ్జైటెడ్ గా ఈ సిరీస్ ని చూడాలని ఎదురు చూస్తున్న ఈ బిగ్ డే రానే వచ్చింది. మొత్తానికి పాన్ ఇండియా సహా ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని భాషల్లో ఈ సిరీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సీజన్ మొదటి పార్ట్ లో మొత్తం 4 ఎపిసోడ్స్ ని స్ట్రీమింగ్ కి తీసుకురాగా ఇందులో ఒకో ఎపిసోడ్ గంటకి పైగానే ఉంది. మరి ప్రపంచ ఆడియెన్స్ ఎదురు చూస్తున్న ఈ సీజన్ ఎలాంటి కొత్త రికార్డులు సెట్ చేస్తుందో చూడాల్సిందే.
The publish ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన గ్లోబల్ సెన్సేషనల్ సిరీస్.. రికార్డుల పాతరేస్తుందా first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
