Wed. Apr 22nd, 2026

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్’ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. లవ్, యాక్షన్ అంశాలతో ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ ట్రైలర్‌పై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రశంసల జల్లు కురిపించాడు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే అడివి శేష్, ఈసారి ‘లవ్ స్టోరీ డ్రివెన్ యాక్షన్’ డ్రామాతో రాబోతుండటం పట్ల తారక్ ఆసక్తి వ్యక్తం చేశాడు.

ట్రైలర్ చాలా ఇంటెన్సివ్‌గా, అద్భుతమైన విజువల్స్‌తో ఉందంటూ ఆయన చిత్రబృందాన్ని అభినందించారు. చిత్ర బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ తారక్ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్ ఇలా ‘డెకాయిట్’ చిత్రానికి సపోర్ట్ చేయడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ చిత్రం, తారక్ ప్రశంసలతో ప్రేక్షకుల్లో మరింత బజ్‌ను క్రియేట్ చేసుకుంది.

The put up ‘డెకాయిట్’ ట్రైలర్‌కు తారక్ ఫిదా.. అదిరిపోయిందంటూ కితాబు..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.