ప్రముఖ న్యాయవాది, ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర సమర్పకులు డాక్టర్ నాగేశ్వరరావు పూజారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నూతన చిత్రాన్ని ప్రకటించారు. తన సొంత బ్యానర్ ‘సైన్మా స్టూడియోస్’పై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పీవీఎన్ కార్తికేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
నిర్మాత బర్త్‌డే కానుకగా చిత్ర బృందం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఒక అమ్మాయి కంటిలో అన్నాచెల్లెళ్లు సైకిల్‌పై వెళ్తున్న దృశ్యాన్ని ఈ పోస్టర్లో చూపించారు. “ప్రకృతి మనకు ఇచ్చిన స్నేహితుడు మన సోదరుడు.. కానీ ఆ బంధం మధ్యలో అహం అనే అడ్డుగోడలు మనమే నిర్మించుకున్నాం” అనే క్యాప్షన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అన్నాచెల్లెళ్ల బంధం, మానవ సంబంధాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని, మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అతి త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు.
The submit ఆకట్టుకుంటున్న ‘సైన్మా స్టూడియోస్’ మూవీ పోస్టర్.. అన్నాచెల్లెళ్ల బంధం నేపథ్యమా? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
