Wed. Apr 22nd, 2026

నటుడు, రాజకీయ నాయకుడు విజయ్, త్రిష మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది అని వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజంగానే వారిద్దరి మధ్య ప్రేమ ఉందా ?, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా ?, తమిళ సినీ వార్తల్లో ఈ వార్త చుట్టే ఎక్కువగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్రిష పోస్ట్ చేసిన ఓ కోట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. త్రిష తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోలు, లవ్ కోట్ పంచుకున్నారు.

అందులో ఒక వీడియోలో ఇలా ఉంది. ‘మీరు ఇతరుల అభిప్రాయాలను, ఆలోచనలను ఎలా నియంత్రిస్తారు ?, ఎలా శాసించగలరు ?, మీరు చేయగలిగిందల్లా మీ జీవితాన్ని ఉత్తమంగా జీవించడమే. ఒక మంచి వ్యక్తిగా ఉండండి. నిజాయితీతో జీవించండి, మాట్లాడండి. అప్పుడు, ఇదే మీ జీవితంలో అత్యుత్తమ రోజు అని తెలుసుకుని, మీరు రాత్రి హాయిగా నిద్రపోగలరు’ అంటూ ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణకు సంబంధించిన వీడియోని త్రిష తన ఇన్స్టా స్టోరీలో పంచుకుంది.

మొత్తానికి సీనియర్ హీరోయిన్ గా త్రిష స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా, యంగ్ దర్శకుడు వశిష్ట కలయికలో వస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో కూడా నటిస్తోంది.

The publish ‘త్రిష’ పోస్ట్ కి కారణం విజయ్ మీద ప్రేమేనా ? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.