పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కంబ్యాక్ ఇచ్చిన ఒక బ్లాస్టింగ్ హిట్ సినిమానే వకీల్ సాబ్. దర్శకుడు వేణు శ్రీరామ్ ని అభిమానులు ఈ సినిమా చూశాక మాస్ గాడ్ అంటూ ఓ రేంజ్ లో పొగిడిన సినిమా ఇది. అప్పటికే ఎం సి ఏ లాంటి కమర్షియల్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు నుంచి పవర్ స్టార్ ని మరింత పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేయడంతో అభిమానులు అలాంటి కరోనా సమయంలో కూడా ఊగిపోయారు.
ఇప్పుడు ఈ సినిమా వచ్చి ఐదేళ్ళు కావడంతో అభిమానులు మరోసారి ఈ సినిమా కోసం మాట్లాడుతూ దర్శకుడు వర్క్ కోసం గుర్తు చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది కాని ఇప్పుడు అసలు దర్శకుడు వేణు శ్రీరామ్ నెక్స్ట్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న తమ్ముడు సినిమా ప్లాప్ అయ్యింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వేణు పేరు వినిపిస్తోంది. మరి తన నెక్స్ట్ సినిమా ఏంటి? ఎవరితో అనేది ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.
The publish ‘వకీల్ సాబ్’ కి ఐదేళ్లు.. వేణు శ్రీరామ్ నెక్స్ట్ ఏంటి? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
