Wed. Apr 22nd, 2026

గత ఏడాది సరిగ్గా ఇదే ఏప్రిల్ 19న థియేటర్స్ లోకి వచ్చిన మాస్ హిట్ చిత్రాల్లో బాలీవుడ్ బాలయ్య సన్నీ డియోల్ హీరోగా నటించిన సాలిడ్ సినిమా జాట్ కూడా ఒకటి. దర్శకుడు గోపిచంద్ మలినేని హిందీలో తెరకెక్కించిన ఈ సినిమా విడుదల అయ్యి సన్నీ అండ్ మాస్ ఫ్యాన్స్ ని అలరించి 100 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి అదరగొట్టింది.

అయితే ఈ సినిమా సీక్వెల్ ని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు కానీ ఈ సీక్వెల్ ని మాత్రం గోపిచంద్ తెరకెక్కించడం లేదు అన్నట్టు ఊహించని ట్విస్ట్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఫైనల్ గా దీనిపై సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. జాట్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సన్నీ డియోల్ ఇంకా గోపిచంద్ లు తమ ఎక్స్ పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు.

దీనితో పాటుగా జాట్ 2 పై కూడా ఇద్దరూ హింట్ ఇచ్చారు. దీనితో జాట్ 2 గోపిచంద్ మలినేని దర్శకత్వంలోనే తెరకెక్కనుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

The publish ‘జాట్ 2’ దర్శకునిపై బిగ్ ట్విస్ట్! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.