పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల తర్వాత కూడా హరీష్ శంకర్ సోషల్ మీడియాలో సినిమాను గట్టిగా వెనకేసుకొచ్చాడు. అయితే, ప్రేక్షకుల నుండి వస్తున్న నెగటివ్ ఫీడ్‌బ్యాక్‌ను ఆయన అంగీకరించడం లేదని అప్పట్లో భారీగా విమర్శలు వచ్చాయి.
తాజాగా నటుడు తిరువీర్ నటించిన ‘పాపం ప్రతాప్’ మూవీ ఈవెంట్‌కు హాజరైన హరీష్, స్టేజ్ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యాంకర్ తనను ‘పాపం హరీష్’ అని పిలవగానే, ఉస్తాద్ భగత్ సింగ్ సరిగ్గా ఆడలేదనే ఉద్దేశంతోనే అలా అన్నారేమో అని తాను అనుకున్నట్లు నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అందరినీ అలా పిలవడం చూసి, అది ప్రమోషన్‌లో భాగమని అర్థం చేసుకున్నానని చెబుతూనే, సినిమా ఫలితంపై తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు.
ఎట్టకేలకు హరీష్ శంకర్ తన సినిమా ఫలితాన్ని అంగీకరించడం ఫ్యాన్స్‌కు కాస్త ఊరటనిస్తోంది. అగ్రెసివ్ ప్రమోషన్ల కంటే కంటెంట్‌పై దృష్టి పెడితే హరీష్ మళ్ళీ తన ఫామ్‌లోకి రావడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.
The publish పాపం హరీష్.. ఎట్టకేలకు ఉస్తాద్ ఫెయిల్యూర్ ఒప్పుకున్న డైరెక్టర్..! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
