Wed. Apr 22nd, 2026
Venu Udugula: ఇద్దరూ పరిచయమే కానీ.. మంగ్లీ కేసుపై వేణు ఉడుగుల కీలక ప్రకటన!

Venu Udugula: ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా సహా కొన్ని ప్రధాన వార్తా సంస్థల్లో తన పేరు మీద తిరుగుతున్న వివాదాలపై ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల ఎట్టకేలకు మౌనం వీడారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ, అసలు ఏం జరిగిందనే విషయంపై స్పష్టతనిచ్చారు. మంగ్లీ కేసుకు సంబంధించి వేణు ఉడుగుల పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆ ఘటనలో ఆయనకు ప్రమేయం ఉందంటూ కొన్ని మీడియా వేదికలు కథనాలను ప్రసారం చేశాయి. ఈ వార్తలు తనను మరియు తన కుటుంబాన్ని తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

READ ALSO: Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు అదృష్టం తలుపు తట్టబోయే రాశులు ఇవే! కుబేరుడి అనుగ్రహంతో డబ్బే డబ్బు..

మంగ్లీ , కంప్లైంట్ చేసిన అడ్వకేట్ సుబ్బారావు ఇద్దరూ తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వ్యక్తులని వేణు తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆ సమస్యను వివాదం చేయకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, బాధితులకు న్యాయం జరగాలని మాత్రమే తాను సూచించినట్లు ఆయన స్పష్టం చేశారు. అంతకుమించి ఆ వ్యవహారంలో తనకు ఎటువంటి పాత్ర లేదని ఆయన అన్నారు. ఈ కేసుకు సంబంధించి నమోదైన FIRలో తన పేరు నిందితుడిగా ఎక్కడా ప్రస్తావించబడలేదని ఆయన అన్నారు. చట్టబద్ధంగా తనకు ఈ వివాదంతో ఎటువంటి సంబంధం లేదని ఇది నిరూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీసులు కూడా ప్రాథమిక విచారణలో భాగంగా ఈ ఘటనతో తనకు సంబంధం లేదని నిర్ధారించినట్లు వేణు తన ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన అడ్వకేట్ సుబ్బారావు కూడా మీడియా ముందుకు వచ్చి, వేణు ఉడుగులకు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా అందుబాటులో ఉన్నాయని వేణు పేర్కొన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఒక వ్యక్తి గౌరవం, పేరు ప్రతిష్టలు, కుటుంబాన్ని రోడ్డుపైకి లాగడం సరికాదని ఆయన మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు ప్రచారాల వల్ల కలిగే నష్టం పూడ్చలేనిదని ఆయన ఆందోళన వ్యక్తం చేశార. “నాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమే నాకు ఎప్పుడూ బలాన్ని ఇస్తుంది. అదే విశ్వాసంతో ఈ వివరణ ఇస్తున్నాను. దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయకండి.” అని ఆయన కోరారు.

READ ALSO: Kitchen Guidelines : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!