Sun. Jul 5th, 2026

భారీ అంచనాలతో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రబృందం ప్రస్తుతం ఒక విచిత్రమైన రిలీజ్ డేట్ పజిల్‌ను ఎదుర్కొంటోంది. మార్చి నుంచి మొదలుపెట్టి, మొన్నటి ఆగస్ట్ 21 వరకు ఎప్పటికప్పుడు సరికొత్త డేట్లతో ప్రేక్షకులను ఊరించినప్పటికీ, ఏదీ వర్కవుట్ కాలేదు. పైగా మేకర్స్ వదిలేసిన ఆగస్ట్ డేట్‌ను రవితేజ ‘ఇరుముడి’ టీమ్ చకచకా లాగేసుకోవడంతో, ఇప్పుడు ‘ప్యారడైజ్’ టీమ్ సెప్టెంబర్ 25 వైపు లుక్కేసింది. కానీ, తాజా ఇన్సైడ్ టాక్ ప్రకారం ఆ తేదీకి కూడా సినిమా రావడం అనుమానమే అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఈ డేట్ల మార్పుల వెనుక అసలు ట్విస్ట్ ఏంటంటే.. సినిమా ఇంకా గుమ్మడికాయ కొట్టడానికి సిద్ధంగా లేదట. కనీసం మరో రెండు నెలల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేయాల్సిన సీన్ ఇంకా బాకీ ఉంది. ఒకవేళ అక్టోబర్ నాటికి ఎలాగోలా గుమ్మడికాయ కొట్టి థియేటర్లలోకి వద్దామన్నా, అక్కడ ‘రామాయణ’ లాంటి పాన్-ఇండియా విజువల్ వండర్ కాచుకుని కూర్చుంది. ఆ సినిమాతో తలపడితే అటు బాలీవుడ్ బెల్ట్, ఇటు ఓవర్సీస్ మార్కెట్‌లో థియేటర్లు దొరకడం గగనమైపోతుంది. దీంతో నవంబర్ అనే డల్ సీజన్‌ను నమ్ముకోలేక మేకర్స్ తీవ్ర ఒత్తిడిలో పడ్డారు.

ఈ మొత్తం వ్యవహారంలో చిత్ర యూనిట్‌కు ఉన్న ఏకైక బెటర్ ఆప్షన్ డిసెంబర్ మాత్రమే. అయితే అక్కడ కూడా ప్రభాస్ ‘ఫౌజీ’, షారుఖ్ ఖాన్ ‘కింగ్’ వంటి భారీ ప్రాజెక్టులు పోటీగా నిలిచే ప్రమాదం ఉంది. పైగా ఇదొక ఊరమాస్ వయొలెంట్ యాక్షన్ డ్రామా కావడం వల్ల, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే సంక్రాంతి పండగ సీజన్‌కు ఇది అస్సలు సూట్ అవ్వదు. గతంలో ‘సలార్’ కూడా ఇదే స్ట్రాటజీతో జనవరిని కాదని క్రిస్మస్ విండోలో వచ్చి ఎలాగైతే క్లీన్ స్వీప్ చేసిందో, ఇప్పుడు ‘ప్యారడైజ్’ కూడా అలాంటి ఒక సోలో డేట్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

The put up అయోమయంలో ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్.. ఇక వచ్చేది అప్పుడేనా..? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.