కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు/వీర భద్రుడు తో మంచి కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ సినిమా ఏమన్నా మిస్ ఫైర్ అయితే తన నుంచి నెక్స్ట్ రానున్న సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పై ఆ బాధ్యత ఉండేది. కానీ కరుప్పు భారీ హిట్ కావడంతో విశ్వనాథ్ అండ్ సన్స్ పై ప్రెజర్ ఇంకా ఎక్కువ పడింది.
మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా తన గత సినిమాల్లో ఒకటైన ‘సార్’ లానే తెలుగు, తమిళ్ లో ఒకేసారి తీసిన సినిమా అని చాలా మంది అనుకున్నారు. కానీ దీనిపై దర్శకుడు అసలు క్లారిటీ అందించాడు.
విశ్వనాథ్ అండ్ సన్స్ కేవలం తమిళ్ లో మాత్రమే తీసిన సినిమా అని దీనిని ఒకేసారి తెలుగులో తెరకెక్కించలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కేవలం తెలుగు డబ్బింగ్ మాత్రమే విడుదల అవుతుంది అని గత కొన్నాళ్ల నుంచి ఉన్న అపోహలకు చెక్ పెట్టారు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా ఈ ఆగస్ట్ 14న సినిమా విడుదల కాబోతుంది.
The submit సూర్య సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చేసిన వెంకీ అట్లూరి! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
