Sat. Jul 25th, 2026

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘రాకా’ కోసం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో గ్రాండ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూట్ పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పటికీ ఈ చిత్రం కోసం బేసిక్ ఐడియా లేదు.

ఇది సై ఫై సినిమానా లేక మైథాలజీ సినిమానా లేక ఏంటి అనేది ఏ క్లారిటీ లేదు. అయితే రాకా వరల్డ్ పై ఓ అసలు క్లారిటీ అతి త్వరలోనే వస్తుంది అని అల్లు కాంపౌండ్ నుంచి ఓ క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది. అట్లీ, సన్ పిక్చర్స్ రాకా వరల్డ్ పై ఓ క్లారిటీ త్వరలోనే అందిస్తారని అల్లు ఫ్యామిలీ సన్నిహితుడు శరత్ చంద్ర నాయుడు క్లారిటీ ఇచ్చారు. సో రాకా విషయంలో ఫ్యాన్స్ ఆ సమయం కోసం వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకార్ సంగీతం అందిస్తుండగా దీపికా హీరోయిన్ గా నటిస్తుంది.

The submit ‘రాకా’ ప్రపంచంపై అసలు క్లారిటీ త్వరలోనే! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.