Sun. Jul 5th, 2026

విడుదల తేదీ : జూలై 3, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు : ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు
దర్శకత్వం : శివ్ రావెల్
నిర్మాతలు : ఆదిత్య చోప్రా
సంగీతం : రోహన్ష్, అబీర్
ఛాయాగ్రహణం : రుబాయిస్
కూర్పు: ఆరిఫ్ షేక్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’ భారీ పరాజయం తర్వాత, యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘ఆల్ఫా’. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ:

కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్ (బాబీ డియోల్) తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ‘ఆల్ఫా’ అనే హై-ప్రొఫైల్ ప్లాన్‌ను రూపొందిస్తాడు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా, ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్‌ఫుల్‌గా మార్చాలనే పట్టుదలతో, ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్‌ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత (ఆలియా భట్) భాగమవుతుంది. మరి సీత ఈ ‘ప్లాన్ ఆల్ఫా’ను ఎలా ముందుకు తీసుకెళ్లింది? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్‌ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్‌తో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను రిచ్‌గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. ఒకటి రెండు యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి.

శర్వరి తన యాక్షన్ మూవ్స్‌తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్‌తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్‌లో ఓకే అనిపించాడు.

మైనస్ పాయింట్స్:

స్పై సినిమాల విషయంలో ‘ధురంధర్’ సెట్ చేసిన మార్క్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కానీ, యష్ రాజ్ ఫిల్మ్స్ మాత్రం తమ పాత ఫార్ములానే కంటిన్యూ చేస్తూ ఈ సినిమాతో మరోసారి డిజాస్టర్‌ను మూటగట్టుకుంది. ఈ సినిమాలో ఉన్న ఒక ట్విస్ట్ బాగానే ప్లాన్ చేసినా, అది పూర్తిగా బెడిసికొట్టి ప్రేక్షకులకు తలనొప్పి తెప్పిస్తుంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇండియన్ ఇంటెలిజెన్స్, ఆర్మీని అత్యంత వీక్‌గా చూపించడం షాకింగ్‌గా అనిపిస్తుంది. దేశ ప్రతిష్టను ఇంత దిగజార్చేలా ఉన్న కాన్సెప్ట్‌ను అసలు ఎలా ఓకే చేశారో అర్థం కాదు.

ఈ సినిమా స్క్రీన్‌ప్లే చాలా బోరింగ్‌గా సాగుతుంది. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లోనే అత్యంత వీక్ చిత్రంగా ఇది నిలుస్తుంది. ఆలియా భట్ అద్భుతమైన నటి అయినప్పటికీ, యాక్షన్ రోల్స్ ఆమెకు అస్సలు సూట్ అవ్వలేదు. టఫ్ గర్ల్ పాత్రలో ఆమె నటన ఏమాత్రం ఆకట్టుకోదు. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చే సినిమాల్లో లాజిక్ లేకపోయినా కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. కానీ ఇందులో ఆ ఎలిమెంట్ కూడా పూర్తిగా మిస్ అయింది. ట్రైలర్‌లోనే హింట్ ఇచ్చిన ఒక క్రేజీ స్పై క్యామియో రోల్ కూడా స్క్రీన్‌పై చాలా పేలవంగా ఎగ్జిక్యూట్ అయింది.

సాంకేతిక విభాగం:

‘ది రైల్వే మెన్’ సిరీస్‌తో మెప్పించిన దర్శకుడు శివ రావల్, ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్‌లో నీట్‌గా ఉంది. సినిమా రన్‌టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ, కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది.

తీర్పు:

మొత్తంగా చూసుకుంటే, ‘ఆల్ఫా’ వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్‌స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ‘ఆల్ఫా’ చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు.

123telugu.com Score: 1.5/5

Reviewed by means of 123telugu Staff

Click on Right here For English Assessment

The publish సమీక్ష : ఆల్ఫా – మిస్ ఫైర్ అయిన స్పై యాక్షన్ డ్రామా first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.