Tue. Apr 21st, 2026

కోర్ట్ అనే సినిమాతో యువ జంట శ్రీదేవి ఆపళ్ళ అలాగే హర్ష రోహన్ లు స్టార్స్ అయ్యారు. అయితే ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తర్వాత ఇద్దరి కలయికలో వచ్చిన లేటెస్ట్ రోమ్ కామ్ చిత్రం ‘బ్యాండ్ మేళం’ మాత్రం ఆ సినిమా రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. గత మార్చ్ 26న థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.

ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులని జీ 5 వారు సొంతం చేసుకోగా లేటెస్ట్ గా వారు స్ట్రీమింగ్ డేట్ ని ఇచ్చేసారు. ఈ ఏప్రిల్ 24 నుంచి బ్యాండ్ మేళం ఓటిటిలో సౌండ్ చేయనున్నట్టు ఖరారు చేశారు. సో ఈ సినిమాని అప్పుడు మిస్సయి ఓటిటిలో చూడాలి అనుకునేవారు చూడొచ్చు. ఇక ఈ సినిమాకి సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించగా బేబీ సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. అలాగే కోనా వెంకట్ నిర్మాణం వహించారు.

The put up ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న కోర్ట్ జంట కొత్త సినిమా.. ఎప్పుడు ఎందులో అంటే first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.