Tue. Apr 21st, 2026

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు మారుతి. ఆ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకోగా, ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో మారుతి ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్న మారుతి తన నెక్స్ట్ చిత్రాన్ని అక్కినేని యంగ్ హీరో అఖిల్‌తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అఖిల్‌కు పలుమార్లు స్క్రిప్టు వినిపించిన మారుతి, ఎలాగైనా అఖిల్‌తో తన నెక్స్ట్ చిత్రాన్ని లాక్ చేయాలని భావిస్తున్నాడు. దీనికితోడు గతంలో అక్కినేని నాగచైతన్యకు ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాతో మంచి హిట్ అందించాడు.

ఈ క్రమంలో ఇప్పుడు అఖిల్‌కు కూడా అలాంటి హిట్ అందిస్తే మారుతి తిరిగి ట్రాక్ ఎక్కడం ఖాయమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే మారుతి అఖిల్‌తో సినిమా చేస్తాడా.. అనేది ఆసక్తికరంగా మారింది.

The submit అక్కినేని హీరోతో మారుతి నెక్స్ట్ మూవీ సెట్ అయ్యేనా..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.