Tue. Apr 21st, 2026

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమా కోసం నాని తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేసి, భారీగా కండలు పెంచి సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే, తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం అనుకున్న సమయానికి థియేటర్లలోకి రావడం కష్టమనే సంకేతాలు అందుతున్నాయి.

​నిజానికి ఈ సినిమాను మొదట వేసవి కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ, తర్వాత దానిని ఆగస్టు 21, 2026కి వాయిదా వేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 50 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందని, ఇంకా కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ మరియు ఇతర భాగాలు చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. దీనికి తోడు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ రీ-రికార్డింగ్ మరియు సంగీత పనుల కోసం ఎక్కువ సమయం తీసుకుంటారనే పేరుంది. ఈ కారణాల రీత్యా, ఆగస్టు నాటికి అవుట్‌పుట్ సిద్ధం కావడం అనుమానంగానే కనిపిస్తోంది.

​ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న రూమర్స్ ప్రకారం, ఈ సినిమా ఆగస్టు నుండి డిసెంబర్‌కు వెళ్లే అవకాశం ఉందట. దీనిపై చిత్ర యూనిట్ నుండి త్వరలోనే ఒక అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

The put up ప్యారడైజ్ కూడా పట్టాలు తప్పుతుందా.. నాని లెక్కల్లో తేడా వస్తుందా..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.