Thu. Jun 25th, 2026

విడుదల తేదీ : జూన్ 19, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న తదితరులు
దర్శకుడు : హోమీ అదాజానియా
సంగీతం : ప్రీతమ్
నిర్మాతలు : దినేష్ విజన్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్
సినిమాటోగ్రఫీ : సంతాన కృష్ణన్ రవిచంద్రన్
ఎడిటింగ్ : అక్షర ప్రభాకర్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

బాలీవుడ్‌లో ఒకప్పటి సూపర్ హిట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘కాక్‌టెయిల్’ కి సీక్వెల్‌గా భారీ అంచనాలతో రూపొందిన చిత్రం ‘కాక్‌టెయిల్ 2’. నేడు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మోడ్రన్ లవ్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

​కథ :

​కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న)తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటాడు. అయితే, వీరిద్దరి లైఫ్‌లోకి ఆల్లీ (కృతి సనన్) రావడంతో వీరి ముగ్గురి మధ్య స్నేహం కాస్తా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారుతుంది. ఈ క్రమంలో కునాల్ ఎవరి వైపు మొగ్గు చూపాడు? చివరకు ఈ ముగ్గురి రిలేషన్‌షిప్ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే మిగతా సినిమా కథ.

​ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో కృతి సనన్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో బబ్లీగా కనిపిస్తూనే, సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో ఆమె పండించిన హావభావాలు ఆకట్టుకుంటాయి.

చాక్లెట్ బాయ్ లుక్స్‌తో షాహిద్ కపూర్ తన లుక్స్ అండ్ స్టైలిష్ పర్ఫార్మెన్స్‌తో యూత్‌ను బాగా ఆకట్టుకుంటాడు.

సిసిలీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే లొకేషన్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కంటికి చాలా గ్రాండ్‌గా అనిపిస్తాయి. ప్రీతమ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా పాయింట్ మోడ్రన్ రిలేషన్‌షిప్స్ చుట్టూ తిరిగినప్పటికీ, కథలో బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం పెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్ అంతా కేవలం పార్టీలు, పబ్బులంటూ సాగదీశారు.

లవ్ డ్రామాల్లో ఆడియన్స్‌కి క్యారెక్టర్ల మధ్య ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ అవ్వాలి. కానీ ఈ సినిమాలో పాత్రల ప్రవర్తన చాలా కన్‌ఫ్యూజింగ్‌గా సాగుతుంది.

రష్మిక మందన్న నటన పరంగా పర్వాలేదనిపించినా, ఆమె క్యారెక్టర్ గ్రాఫ్ సరిగ్గా డిజైన్ చేయలేదు. పైగా ఆమె చెప్పిన హిందీ డైలాగ్స్ చిరాకు తెప్పిస్తాయి.

సెకండ్ హాఫ్‌లో డ్రామా ఎక్కువై ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా రొటీన్ ఫార్ములాలోనే సాగడం మైనస్ .

​సాంకేతిక విభాగం :

​దర్శకుడు హోమీ అదాజానియా మోడ్రన్ మేకింగ్ స్టైల్‌ను నమ్ముకుని కథలో డెప్త్‌ను మర్చిపోయారు. సినిమాటోగ్రఫీ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. సిసిలీ లొకేషన్స్ చాలా అందంగా చూపెట్టారు. మ్యూజిక్ పరంగా సాంగ్స్, బిజిఎం బాగున్నాయి. ఎడిటింగ్ టీమ్ సెకండ్ హాఫ్‌లో కొన్ని అనవసరపు సీన్లను ట్రిమ్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు.

​తీర్పు :

​మొత్తంగా చూసుకుంటే.. క్రేజీ సీక్వెల్ గా వచ్చిన ‘కాక్‌టెయిల్ 2’ అంచనాలు అందుకోవడంలో తడబడింది. కేవలం గ్లామర్, అందమైన లొకేషన్స్ మరియు కొన్ని యూత్‌ఫుల్ ఎలిమెంట్స్ సినిమాకి ప్లస్. అయితే, ఫస్ట్ పార్ట్ రేంజ్ మ్యాజిక్ ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. కథలో బలమైన ఎమోషన్స్, ఆకట్టుకునే కథనం లేకపోవడం వల్ల ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ కాలేకపోతారు.

123telugu.com Ranking: 2.5/5

Reviewed by way of 123telugu Workforce

Click on Right here For English Evaluate

The publish సమీక్ష : కాక్‌టెయిల్ 2 – ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.