Thu. Jun 25th, 2026

విడుదల తేదీ : జూన్ 19, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్‌ రఘువంశీ, రఘుబాబు, దేవి ప్రసాద్, శివన్నారాయణ తదితరులు,
రచన దర్శకత్వం : కమల్‌ తేజ నార్ల
సంగీతం : కల్యాణ్‌ నాయక్‌
నిర్మాత : వడ్డే నవీన్‌

సంబంధిత లింక్స్ : ట్రైలర్

కథ :

కానిస్టేబుల్ త్రిమూర్తులు (వడ్డే నవీన్) ఎక్కువగా ట్రాన్స్ ఫర్ అవుతూ ఉంటాడు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కమలాదేవి తన కొడుకు సంతోష్ బాబుని సీఎం చేయాలని కల కంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణమాల నేపథ్యంలో సరిగ్గా కమలా దేవి, తన పార్టీ తరపున మేనిఫెస్టో రిలీజ్ చేసే టైమ్‌ కి సంతోష్ బాబు.. 20 ఏళ్ల క్రితం ప్రియమ్మ అనే గిరిజన బాలికను రేప్ చేసి చంపేశాడనే విషయాన్ని కానిస్టేబుల్ త్రిమూర్తులు బయటపెడతాడు. ఇంతకీ, ఆ కేసుకి త్రిమూర్తులకు సంబంధం ఏంటి ?, చివరికి ప్రియమ్మకి జరిగిన న్యాయం ఏంటి ?, కానిస్టేబుల్ త్రిమూర్తులు సాధించింది ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

కానిస్టేబుల్ త్రిమూర్తులుగా వడ్డే నవీన్ తన రీఎంట్రీలో చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. తన శైలి టైమింగ్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ తో మరియు బలమైన ఎమోషన్స్ తోనూ వడ్డే నవీన్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. వడ్డే నవీన్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో మరియు తన లుక్స్ తో వడ్డే నవీన్ చాలా బాగా ఆకట్టుకున్నాడు.

హీరోయిన్ గా రాశీ సింగ్ తన గ్లామర్ తో అలరించింది. ఇతర కీలక పాత్రల్లో నటించిన దేవీ ప్రసాద్,రఘుబాబు,ఆడుకలం నరేన్ తమ పాత్రలో ఒదిగిపోయారు. అలాగే, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఇక సినిమాలో ప్రధనంగా అవినీతి రాజకీయ నాయకుల నేర నేపధ్యాన్ని చూపించిన విధానం బాగుంది. అలాగే విలన్ ట్రాక్, పొలిటికల్ నేపథ్యం కూడా చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు, అంతే స్థాయిలో ఈ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. కొన్ని సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో – విలన్ మధ్య మైండ్ గేమ్ ని ఇంకా ఇంట్రెస్ట్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది.

ఈ ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు సినిమాలో క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకత మిస్ అయ్యింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. మొత్తానికి హీరో క్యారెక్టరైజేషన్, బీజీఎం బాగున్నప్పటికీ.. సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు విలన్ పాత్రను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు కమల్‌ తేజ నార్ల తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ అంటూ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. వడ్డే నవీన్ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ మిస్ అయ్యాయి. పైగా ఉన్న ఎమోషన్ లో, ఉన్న కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకోదు.

123telugu.com Ranking: 2.5/5

Reviewed by means of 123telugu Staff

Click on Right here For English Evaluation

The put up సమీక్ష :- ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు – రొటీన్ పోలీస్ యాక్షన్ ఎంటర్ టైనర్! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.