Tue. Apr 21st, 2026
JD Chakravarthy: ‘చేతబడి’ చేస్తున్న జేడీ చక్రవర్తి!

జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘‘చేతబడి” అనే టైటిల్‌ను రివీల్ చేశారు. M3 Media మరియు Maha Films సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తుండగా, మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాటోగ్రఫీ మిర్లాన్ నసీర్, ఎడిటింగ్ వంశీ నిర్వహిస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ ఆసక్తికరమైన చిత్రం హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంటుంది.

Additionally Learn:Jailer 2 Scenes Leaked: ‘జైలర్ 2’ రెండు సీన్లు లీక్.. సోషల్ మీడియాలో రజనీకాంత్ వీడియోలు వైరల్!

ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. గురువారం వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఇందులో ఆయన పోషిస్తున్న పాత్ర గురించి రివీల్ చేశారు మేకర్స్. మునుపెన్నడూ పోషించని డిఫరెంట్ అవతార్‌‌లో హీరోగా, విలన్‌గా జేడీ చక్రవర్తి కనిపించనున్నారని యూనిట్ తెలియజేసింది. మరోవైపు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకముందే.. ఐదు భాషల ఆడియో రైట్స్‌ను మ్యూజిక్ సెన్సేషన్ సరిగమ సంస్థ దక్కించుకుంది. ఒక పాటను ఐదు భాషల్లో విడుదల చేయడం కామన్‌గా జరుగుతుంది. కానీ ఇందులో తెలుగులో ఒక పాట, మిగిలిన భాషల్లో డిఫరెంట్ సాంగ్స్‌, సేమ్ విజువల్‌తో రావడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వచ్చే నెలనుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.