Wed. Apr 22nd, 2026
Jr NTR : ఎన్టీఆర్‌ను ఢీ కొట్టేదెవరు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. ఈ ప్రాజెక్ట్ నుండి విలన్‌గా నటిస్తాడననుకున్న మలయాళ స్టార్ నటుడు టోవినో థామస్ తప్పుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో విలన్ రోల్ కూడా అంతే ధీటుగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌తో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ఢీ కొట్టబోతున్నాడని తెలియడంతో ఈ ఇద్దరి మధ్య యాక్షన్ మామూలుగా ఉండదని అనుకున్నారు.

Additionally Learn : NBK113 : పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నందమూరి బాలకృష్ణ

కానీ టొవినో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఇతర సినిమాల కారణంగా డేట్స్ అడ్జస్ట్‌మెంట్ కుదరకపోవడం వల్లే ఈ భారీ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికే డ్రాగన్ షూటింగ్ జెట్‌ స్పీడ్‌లో జరుగుతోంది. దాదాపుగా 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. మరి ఇప్పటి వరకు విలన్ డ్రాగన్ సెట్స్‌లో అడుగుపెట్టలేదా? అంటే క్లారిటీ లేకుండా పోయింది. అసలు ఇప్పటి వరకు కొత్త విలన్ విషయంలో ఎలాంటి లీకేజీ బయటికి రాలేదు. దీంతో.. ఎన్టీఆర్ విలన్ ఫిక్స్ అయ్యాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అసలు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం ఎవరిని రంగంలోకి దింపుతున్నాడు? టొవినో రేంజ్‌ నటుడిని తీసుకొస్తారా? అనేది మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఎన్టీఆర్ వంటి మాస్ హీరోని ఢీకొట్టే ఆ స్టార్ ఎవరో చూడాలి. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రుక్మిణి వసంత్ విషయంలోను అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.