Wed. Apr 22nd, 2026
Krithi Shetty Comeback: కృతి ఈజ్ బ్యాక్.. గుడ్ టైం మళ్లీ స్టార్ట్ అయినట్టేనా?

టాలీవుడ్ ‘బేబమ్మ’ కృతి శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది, తన పర్సనల్ లైఫ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. “నేను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నా, నా జీవితంలో ఒక బ్రేకప్ ఉంది, ఆ విషయం మా అమ్మకు కూడా తెలుసు” అంటూ కృతి ఓపెన్ అయిపోయింది. నెగెటివిటీని ఏమాత్రం సహించనని, అసభ్యంగా ప్రవర్తించే వారిని సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తానని కూడా కుండబద్ధలు కొట్టింది. కృతి నటించిన సరికొత్త లవ్ ఎంటర్టైనర్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విడుదలకు సిద్ధమైంది. ‘లవ్ టుడే’ సినిమాతో యూత్ ఐకాన్‌గా మారిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. లేడీ సూపర్ స్టార్ నయనతార స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే ఆమె ఈమేరకు కామెంట్స్ చేసింది.

Additionally Learn :Dragon : ఎన్టీఆర్ కారణంగా నిలిచిన షూట్?

‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’లో ఎస్.జె. సూర్య, యోగి బాబు వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు తెలుగు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సమ్మర్ బరిలో యూత్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా శ్రీ పద్మిని సినిమాస్ వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. బ్రేకప్ స్టోరీలు, సోషల్ మీడియా నెగెటివిటీ గురించి కృతి శెట్టి చేసిన వ్యాఖ్యలు ఈ సినిమా ప్రమోషన్లకు కొత్త జోష్‌ని ఇచ్చాయి. మరి ఈ ‘లవ్ ఇన్సూరెన్స్’ ప్రేక్షకులకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో చూడాలి!