Wed. Apr 22nd, 2026

మలయాళ చిత్ర పరిశ్రమ తన మేకింగ్ స్టైల్‌తో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారీ బడ్జెట్‌లు, ఏళ్ల తరబడి షూటింగ్‌లు అవసరం లేకుండా, కేవలం టాలెంట్ ఉన్న చిన్న నటీనటులతో నాణ్యమైన సినిమాలు తీయడంలో వారు స్పెషల్ అని ‘వజా 2’ నిరూపించింది. టాలీవుడ్ నిర్మాత సాహూ గారపాటి కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావడం విశేషం కాగా, మన దగ్గర టైర్ 2 హీరోలే ఏడాదికి ఒక సినిమా చేయడానికి తడబడుతున్న వేళ, ఈ సినిమా మేకింగ్ వేగం చర్చనీయాంశమైంది.

​బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తూ కేవలం 10 రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. దర్శకుడు నవీన్ ఎస్ఏ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ డ్రామా, చదువు అబ్బని నలుగురు కుర్రాళ్ళ స్నేహం చుట్టూ తిరుగుతుంది. పాఠశాల దశలో ‘వేస్ట్ బ్యాచ్’ అనిపించుకున్న వీరు, చదువు పూర్తయ్యాక ఉపాధి కోసం భారత్, దుబాయ్, మరియు యూకే వంటి ప్రాంతాలకు వెళ్లి స్థిరపడటానికి పడే కష్టాలను ఈ కథలో సహజంగా చూపించారు.

​మూడు చాప్టర్లుగా సాగే ఈ సినిమాలో క్లీన్ కామెడీ, సింపుల్ ఎమోషన్స్ హైలైట్‌గా నిలిచాయి. విదేశాల్లో మన యువత పడే ఇబ్బందులు, కుటుంబ అనుబంధాలను దర్శకుడు ఎక్కడా నాటకీయత లేకుండా న్యాచురల్ గా ఆవిష్కరించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ మరియు థియేటర్ ఎపిసోడ్స్ థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాయి. ఒక చిన్న రివెంజ్ ఎలిమెంట్‌ను కూడా కథకు జోడించి, కొత్త తరహా ట్రీట్‌మెంట్‌తో ఆడియన్స్‌కు కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించారు.

The submit మలయాళం నుంచి మరో బ్యాంగర్.. 100 కోట్లతో సత్తా చాటిన చిన్న సినిమా..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.