విడుదల తేదీ : జూలై 3, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : విరాట్ కర్ణ, నభ నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, రిషబ్ షానే, మురళీ శర్మ తదితరులు
దర్శకత్వం : అభిషేక్ నామా
సంగీతం : జునైద్ కుమార్ – అభే
నిర్మాత : కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి
ఛాయాగ్రహణం : సౌందర్ రాజన్ ఎస్
కూర్పు : ఆర్సి ప్రణవ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో అలరించేందుకు వచ్చేసిన తాజా చిత్రాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా “నాగ బంధం” కూడా ఒకటి. యువ హీరో విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం మరియు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా గ్రాండ్ ప్రమోషన్స్, కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది. సో ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
1962 సమయం హిమాలయాల్లో పురావస్తు శాఖకి చెందిన రిసెర్చర్స్ లో ఒకరికి ఆ హిమాలయాల లోతుల్లో కాల వృక్షంలో బందీ కాబడ్డ భైరాగి (గరుడ రామ్) అనే తాంత్రికుడు చెప్పిన బ్రహ్మ కమలం అలాగే గరుడ మంత్రాల గ్రంథం కోసం చెప్పి వాటి ద్వారా లోకాన్ని శాసించే నాగ బంధం కోసం చెప్తాడు. అక్కడ నుంచి అలీ (రిషబ్ షానే) వేట మొదలు పెడతాడు. ఈ క్రమంలో రుద్ర (విరాట్ కర్ణ) ఎలా ఈ నాగ బంధం వలయంలోకి వస్తాడు? తనకి ఆ బ్రహ్మ కమలం, నాగ బంధానికి ఉన్న లింక్ ఏంటి? చివరికి ఆ నాగ బంధం వరకు వెళ్లగలిగారా లేదా? ఈ క్రమంలో జరిగిన పోరాటం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
కొంచెం ఫాంటసీ టచ్ తో నిధి నిక్షేపాల వేట వంటి కాన్సెప్ట్ లు ఒకింత ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తూ ఉంటాయి. అదే తరహా టచ్ తో నాగ బంధం కూడా కనిపిస్తుంది. నాగ బంధం అనే కాన్సెప్ట్ దాదాపు ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఆ లైన్ ని ఇందులో అనుకోని డిజైన్ చేసుకున్న కథనం ఫస్టాఫ్ లో ఎంగేజ్ చేస్తుంది. ఒకింత పెద్ద నిడివి సినిమానే అయినప్పటికీ ఫస్టాఫ్ లో దాదాపు కథనం డీసెంట్ గా ఎంగేజ్ చేసే విధంగానే వెళ్ళిపోతుంది.
ఇంటర్వెల్ బ్లాక్ యాక్షన్ సీన్ మరికొన్ని యాక్షన్ సీన్స్ వంటివి ఈ సినిమాలో హైలైట్ గా అనిపిస్తాయి. వీటితో పాటుగా సినిమాలో భారీ స్కేల్ మరో హైలైట్ అని చెప్పాల్సిందే. అనంత పద్మనాభ స్వామిని రంగనాథ స్వామిగా చూపించి ఒక సరికొత్త ప్రపంచాన్నే ఇందులో సృష్టించారు. గ్రాండ్ విజువల్స్, భారీ సెట్టింగ్స్ తో విజువల్స్ చాలా రిచ్ గా కనిపిస్తాయి.
ఇక నటీనటుల్లో విరాట్ కర్ణ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. తనపై క్లోజప్ షాట్స్ బాగున్నాయి. అలాగే నటన, డ్యూయల్ షేడ్స్, యాక్షన్ సీన్స్ తనపై బాగున్నాయి. నభా నటేష్ కి ఈ సినిమాలో సర్ప్రైజింగ్ రోల్ దక్కింది అని చెప్పొచ్చు. ఆ రోల్ లో ఆమె బాగా చేసింది.
తనతో పాటుగా దక్ష నగర్కార్ కూడా కొంచెం సేపు కనిపించినా మెప్పించింది. ఇక జగపతి బాబు, మురళి శర్మ లాంటి నటులు తమ పాత్రలకి బలం చేకూర్చారు. వీరితో పాటుగా గరుడ రామ్ అంత ప్రొస్థెటిక్ మేకప్ లో కూడా మంచి పెర్ఫామెన్స్ అందించారు. ఇక క్రూరమైన విలన్ గా నటించిన రిషబ్ షానే తన రోల్ లో అదరగొట్టాడు.
మైనస్ పాయింట్స్:
సినిమా కాన్సెప్ట్ లో మంచి పొటెన్షియల్ ఉంది కానీ దీనికి అనవసరపు హంగామా మాత్రం చాలా ఎక్కువే చేసారని చెప్పక తప్పదు. ఓకే పర్వాలేదు అనుకునే ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ మాత్రం సినిమాలో ఎంగేజ్ చేసే విధంగా నడపలేదు. చాలా సాగదీత మలిసగంలో కనిపిస్తుంది.
పైగా ఇది వరకే ఎన్నో సినిమాల్లో చూసేసిన సన్నివేశాలు, కాన్సెప్ట్ లు అలా చూస్తున్నంతసేపు ఆడియెన్స్ మైండ్ లో మెదలాడుతూనే ఉంటాయి. వీటితో కొత్తదనం ఏమి లేదు అనిపిస్తుంది. ఇక ఆ క్లైమాక్స్ పోర్షన్ ఫైట్ అయితే అది ఎంతకీ ఆగదు అలా సాగుతూ.. చూసే ఆడియెన్ కి బోర్ కొట్టించే వరకు వెళుతూనే ఉంటుంది.
ఇలాంటి వాటి విషయంలో కొంచెం కేర్ తీసుకొని అంత పెద్ద నిడివి అవసరం లేకుండా కట్ చేయాల్సింది. అలానే ఫస్టాఫ్ అంతా బాగానే వెళుతుంది అనే సమయంలో లీడ్ జంట మధ్య ఆకస్మికంగా వచ్చే రొమాంటిక్ సాంగ్ ఉన్న ఫ్లోని దెబ్బ తీస్తుంది. పోనీ వారిద్దరి ట్రాక్ అయినా కొంచెం అర్ధవంతంగా అనిపిస్తుందా అంటే అది కూడా లాజికల్ గా అనిపించదు.
వారిద్దరి మధ్య మంచి రొమాంటిక్ సాంగ్ వరకు వెళ్లిపోయే పరిచయం ఎప్పుడు జరిగిందో కూడా చూపించరు. ఫస్టాఫ్ లో ఈ కేర్ తీసుకోవాల్సింది. కానీ సెకండాఫ్ మాత్రం క్లైమాక్స్ లో చివరి కేవలం కొన్ని నిమిషాలు పక్కన పెడితే మిగతా కథనం అంతా చప్పగానే ఉంటుంది. ఇంకా ఇంత ఖర్చులు పెట్టి కొన్ని కీలక సన్నివేశాల్లో ఏఐ విజువల్స్ పై ఆధారపడడం బాధాకరం.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ఈ సినిమా దాదాపు బలంగా ప్లాన్ చేసుకున్నారు. మెయిన్ గా ప్రొడక్షన్ డిజైన్ కి మంచి మార్కులు ఇవ్వొచ్చు. రంగనాథ స్వామి ఆలయం కానీ ఆ విగ్రహ ప్రతిమ కానీ బిగ్ స్క్రీన్ పై చూసేటప్పుడు ఆ డివైన్ ఫీల్ ని తీసుకొస్తాయి. ఆ ఖర్చు వీటిలో కనిపిస్తుంది. జునైద్ కుమార్, అభిలా పాటలు ఓకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల బాగుంది కానీ కొన్ని చోట్ల అంత ఇంపాక్ట్ చూపించలేదు. సౌందర్ రజన్ ఎస్ కెమెరా వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. ఆర్ సి ప్రణవ్ ఎడిటింగ్ లో చాలా వరకు సన్నివేశాలు ట్రిమ్ చేయాల్సింది. వి ఎఫ్ ఎక్స్ షాట్స్ బాగున్నాయి కానీ ఏఐ వాడకం డిజప్పాయింట్ చేస్తుంది.
ఇక దర్శకుడు అభిషేక్ నామా విషయానికి వస్తే.. మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నారు. అలాగే ఇందులో నటీనటుల ఎంపిక వారి పాత్రలు డిజైన్ చేసిన విధానం వారి నుంచి మంచి నటన రాబట్టిన తీరు బాగున్నాయి. కాకపోతే ఫస్టాఫ్ ని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు కానీ సెకండాఫ్ ని మాత్రం అదే రీతిలో మైంటైన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. చాలా వరకు కథనాన్ని డ్రాగ్ చేశారు. ఇలాంటివి కొంచెం కేర్ తీసుకోవాల్సింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘నాగ బంధం’ లో కాన్సెప్ట్ దాని చుట్టూ నడిచే డ్రామా అక్కడక్కడా కొంతమేర ఓకే అనిపిస్తుంది. విరాట్ కర్ణ ఈ సినిమా కోసం గట్టి ఎఫర్ట్స్ పెట్టాడు. అలానే సినిమాలో గ్రాండ్ స్కేల్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. సహాయ నటుల పెర్ఫామెన్స్ లు కూడా బాగున్నాయి. కానీ సెకండాఫ్ మాత్రం సినిమాలో సాగదీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని డివోషనల్ అడ్వెంచర్ సినిమాల ఫీల్ నే ఇది కూడా మిగులుస్తుంది. సో ఇవి కొంచెం రొటీన్ గా ఉన్నాయి. వీటిని పక్కన పెడితే కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకుని ఈ సినిమా ట్రై చేస్తే మంచిది.
123telugu.com Ranking: 2.75/5
Reviewed by way of 123telugu Workforce
Click on Right here For English Evaluate
The put up సమీక్ష: నాగ బంధం – అక్కడక్కడా ఓకే అనిపించే గ్రాండ్ స్కేల్ డ్రామా first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
