రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ విడుదల తేదీపై ప్రస్తుతం కన్ఫ్యూజన్ నెలకొంది. మొదట 2026 ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా, షూటింగ్ ప్యాచ్ వర్క్ మరియు ఒక స్పెషల్ సాంగ్ బాకీ ఉండటంతో సినిమా జూన్ 2026కి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.
దీనికి తోడు, అమెరికాలో ఈరోజు ప్రారంభం కావాల్సిన అడ్వాన్స్ బుకింగ్స్‌ను చిత్ర యూనిట్ నిలిపివేయడం ఈ వార్తలకు బలాన్నిస్తోంది. ఈ అయోమయం వల్ల వేసవిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలనుకుంటున్న ఇతర నిర్మాతలు కూడా అయోమయంలో పడుతున్నారు.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతంలో రూపొందుతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై క్లారిటీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
The publish పెద్ది బుకింగ్స్ కి బ్రేక్.. అసలు విషయం ఎప్పుడు చెబుతారో..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
