Sun. Jul 5th, 2026

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దీపికా పదుకోణ్ హీరోయిన్ గా కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ కలయికలో చేస్తున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం రాకా కోసం అందరికీ తెలిసిందే. పుష్ప లాంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత బన్నీ నుంచి ఈ సినిమా అంతర్జాతీయ లెవెల్లో రాబోతుంది.

ఇక అందుకు తగ్గట్టే క్రేజీ ప్లానింగ్ లు జరుపుకుంటున్న ఈ చిత్రంపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం రాకా సంగీత దర్శకుడు జెన్ జీ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఆల్రెడీ ఆల్బమ్ మొత్తాన్ని కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. అవి కాకుండా కొన్ని బిట్ ట్రాక్స్ ఇపుడు సిద్ధం చేస్తున్నట్టు టాక్.

సో మొత్తానికి రాకా కోసం సాలిడ్ ఆల్బమ్ సిద్ధం అవుతుంది అని చెప్పవచ్చు. అట్లీ గ్రాండ్ లెవెల్లో విజువల్స్ పరంగా కూడా ఎక్కడా రాజీ పడకుండా దీనిని చేస్తుండగా షూట్ ప్రస్తుతం కొనసాగుతూ వెళుతుంది. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు తమ బ్యానర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తీస్తున్నట్టు టాక్.

The put up RAAKA: ఐకాన్ స్టార్ ‘రాకా’ పై ఇంట్రెస్టింగ్ బజ్! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.