Sun. Jul 5th, 2026

ఓటీటీ వేదిక : నెట్ ఫ్లిక్స్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జూలై 2, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ, జీవన్ తదితరులు
దర్శకులు : మల్లిక్ రామ్
నిర్మాతలు : రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి
సంగీతం : అనుదీప్ దేవ్
ఛాయాగ్రహణం : ఏజే ఆరోన్
కూర్పు : విప్లవ్ నైషధం

సంబంధిత లింక్స్ : ట్రైలర్

యువ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్ లో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చిన వెబ్ సిరీస్ నే ‘సూపర్ సుబ్బు’. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

సుబ్బుగా పిలవబడే సుబ్రహ్మణ్యం చిలుకూరి రావు (సందీప్ కిషన్) తనకి ఇష్టం లేకపోయినప్పటికీ తన తండ్రి కుక్కుటేశ్వరరావు (మురళీ శర్మ) కారణంగా ఓ కంప్యూటర్ టీచర్ గా పని చేస్తూ ఇష్టం లేని లైఫ్ ని నెట్టుకుంటూ వస్తాడు. ఇలా వెళుతున్న సమయంలో ఓ సంఘటన తనని ఊహించని రిస్క్ లోకి నెట్టేస్తుంది. ప్రిన్స్ పాల్ మధుసూధనరావు (బ్రహ్మానందం) సుబ్బుని తెలంగాణాలో మఖిపూర్ అనే చిన్న గ్రామంలో సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా నియమిస్తారు. ఆ ఊర్లో ఇంట్రెస్టింగ్ గా జనన రేటు అధికంగా ఉంటుంది. సో అలాంటి ఊరిలోకి వెళ్లిన తర్వాత సుబ్బుకి ఎదురైన పరిస్థితులు ఏంటి?అలాగే తన పర్శనల్ లైఫ్ లో కూడా జరిగిన మార్పులు ఏంటి అనేవి ఈ సిరీస్ లో ప్రధాన కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో ప్రధాన బలం ఏదన్నా ఉంది అంటే దర్శకుడు ఎంచుకున్న కథాంశం అని చెప్పవచ్చు. సెక్స్ ఎడ్యుకేషన్/ లైంగిక విద్య నేపథ్యాన్ని తీసుకోవడం ఒకింత బోల్డ్ మూవ్ అని చెప్పవచ్చు. ఈ తరహా కాన్సెప్ట్ లు మన తెలుగు నుంచి టచ్ చేసిందే గగనం అలాంటిది ఇలాంటి నేపథ్యాన్ని దర్శకుడు, హీరో కూడా ఎంచుకోవడం మంచి విషయం. దీనితో పాటుగా ఈ కాన్సెప్ట్ లోని లోతుని, సామాజికంగా అర్ధం అయ్యే రీతిలోనే ప్రెజెంట్ చేయడం అక్కడక్కడా బాగుంది.

ఇక తన పాత్రలో సందీప్ కిషన్ అలరించాడు. తనకంటూ ఉన్న ఒక డిఫరెంట్ కామెడీ టైమింగ్ అండ్ పెర్ఫామెన్స్ లతో సందీప్ కిషన్ బాగా చేసాడు. తన ప్రొఫిషనల్, పర్శనల్ లైఫ్ లో రెండు షేడ్స్ ని నీట్ గా తాను ప్రెజెంట్ చేసాడు.

ఇక తనకి ఉన్న లిమిటెడ్ స్క్రీన్ టైం లో నటి మిథిలా పాల్కర్ డీసెంట్ పెర్ఫామెన్స్ చేసింది. తన పాత్రలో చాలా నాచురల్ గా పెర్ఫామ్ చేస్తూ ఓ ఆడిషన్ సీక్వెన్స్ లో తన పెర్ఫామెన్స్ హైలైట్ గా కనబరిచింది.

వీరితో పాటుగా నటుడు మురళీ శర్మ సుబ్బు తండ్రి పాత్రలో ఆ పాత్రకి కావాల్సిన లక్షణాలని బాగా క్యారీ చేస్తూ నటించారు. గెటప్ శ్రీనుపై కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. వీరితో పాటుగా దివ్య పిళ్ళై, జీవం కుమార్ తదితరులు తమ పాత్రల్లో బాగా నటించారు.

మైనస్ పాయింట్స్:

ఈ తరహా సిరీస్ లకి ఒక ప్రామిసింగ్ కాన్సెప్ట్ ఉన్నపుడు దానిని ఆధ్యంతం ఎంగేజింగ్ గా అర్ధవంతంగా తీసుకెళ్తేనే పూర్తి స్థాయిలో మెప్పిస్తుంది. కానీ సూపర్ సుబ్బులో ఇది లోపించింది. రెండు ఎపిసోడ్స్ వరకు బాగానే అనిపిస్తుంది కానీ మూడో ఎపిసోడ్ నుంచి అసలు స్ట్రగుల్ మొదలవుతుంది. స్క్రీన్ ప్లే సరిగ్గా అనిపించదు. పైగా స్లో కథనం మరింత నీరసాన్ని తీసుకొస్తుంది. డ్రామాని బిల్డ్ చేయకుండా కథనాన్ని అనవసరంగా సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది.

ఇక ఇందులో మరో సిల్లీ అంశం ఏంటంటే సుబ్బు పాత్ర కథనంలో దాదాపు నాలుగు నెలలు పాటు ఎలాంటి నెట్వర్క్ లేని పరిస్థితిలో ఉంటాడు. అయినప్పటికీ తాను కనిపించడం లేదు అనే ఆందోళన కంగారు కానీ తన కుటుంబంలో ఎక్కడా కనిపించకపోవడం లాజిక్ కి దూరంగా ఉంటుంది. అలానే మానసతో తన రొమాంటిక్ ట్రాక్ కూడా సిరీస్ లో అంతగా వర్క్ అవ్వలేదు.

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. నీట్ సెటప్ లో ప్లాన్ చేసుకున్న నేపథ్యం నాచురాలిటీ తీసుకొచ్చింది. ఏజే ఆరోన్ కెమెరా వర్క్ బాగుంది. అనుదీప్ దేవ్ సంగీతం కూడా బాగుంది. కానీ విప్లవ్ నైషధం ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేయాల్సింది.

ఇక దర్శకుడు మల్లిక్ రామ్ విషయానికి వస్తే.. తాను ఎంచుకున్న నేపథ్యానికి తనని మెచ్చుకొని తీరాలి. అరుదుగా ఎక్స్ ప్లోర్ చేసిన ఈ కాన్సెప్ట్ ని తాను చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనిలో ఉన్న పొటెన్షియల్ కి తగ్గ పూర్తి స్థాయి వర్క్ మాత్రం ఇందులో మిస్ అయ్యిందని చెప్పక తప్పదు. వీటిపై కొంచెం కేర్ తీసుకొని ఉంటే బెటర్ ఫీల్ ని మిగిల్చి ఉండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే ‘సూపర్ సుబ్బు’ వాచబుల్ కామెడీ సిరీస్ గా నిలుస్తుంది. ఒక రేర్ పాయింట్ తో వచ్చిన ఈ సోషల్ సబ్జెక్టులో కామెడీ ఇంకా కొన్ని ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే సందీప్ కిషన్ కూడా తన మార్క్ పెర్ఫామెన్స్ ఇంకా కామెడీ టైమింగ్ లతో ఇంప్రెస్ చేసాడు. వీటితో పాటుగా ఇతర నటీనటులు కూడా డీసెంట్ పెర్ఫామెన్స్ లు అందించారు. ఇవి పక్కన పెడితే కొన్ని చోట్ల కథనం స్లో కావడం, కొన్ని లాజికిల్ ఎర్రర్స్ డిస్టబెన్స్ గా అనిపిస్తాయి. ఇవి పక్కన పెడితే ఈ సిరీస్ ని చూడొచ్చు.

123telugu.com Score: 3/5

Reviewed by means of 123telugu Workforce

Click on Right here For English Evaluation

The put up ఓటిటి సమీక్ష: ‘సూపర్ సుబ్బు’ – సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.