రేసన్ (RAYSUN) ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీకృష్ణ నిర్మాణంలో తెరకెక్కుతున్న “రాయవలస” చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అవార్డు విజేత, ఎన్‌ఆర్‌ఐ మహిళా దర్శకురాలు రాధిక జయంతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సింగర్, రైటర్, డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా యువకుడు కార్తీక్ జయంతి ఈ సినిమా ద్వారా ‘నవ యువ కథానాయకుడు’గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అతనికి జోడీగా శ్రీషా నూలు నటిస్తున్నారు.
గ్రామీణ వాతావరణం, నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాఖీ అందించిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఒక రైస్ మిల్ యజమాని రాజు జీవితంలోకి హీరోయిన్ ప్రవేశించాక జరిగే నాటకీయ పరిణామాల చుట్టూ ఈ కథ సాగుతుంది. “లవ్ టైడ్ బై ఫేట్” (Love Tied by way of Destiny) అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం, యాక్షన్, ఎమోషన్, సంగీతం కలగలిపిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా అలరించనుంది. పక్కా ప్రణాళికతో సింగిల్ షెడ్యూల్‌లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడం విశేషం.
అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవివర్మ, కాశీ విశ్వనాథ్ వంటి సీనియర్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. కెనడాకు చెందిన అర్జున్ బాలా అద్భుతమైన సంగీతం, కిట్టు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి బలం చేకూరుస్తున్నాయి. కాలేజీ విద్యార్థుల సమక్షంలో లాంచ్ అయిన హీరో ఇంటెన్స్ ఫస్ట్ లుక్, సినిమాపై పాజిటివ్ అంచనాలను పెంచుతోంది.
The put up ఆకట్టుకుంటున్న ‘రాయవలస’ ఫస్ట్ లుక్.. హీరోగా కార్తీక్ జయంతి ఎంట్రీ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
