Sun. Jul 5th, 2026

ఈవీవీ సినిమా, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మాణంలో హర్ష్ రోషన్, ప్రియాంక ఆచర్ జంటగా నూతన చిత్రం ప్రారంభమైంది. ఈవీవీ సినిమా బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.10గా, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.

నిజ జీవిత కథ ఆధారంగా ఒక ఇంటెన్స్ లవ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ తనయుడు ఆర్యన్ రాజేష్, మరో నిర్మాత ఎన్.వి. కృష్ణారెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి జిజు సన్నీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, వినీల్ నల్లమిల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మడూరి మధు పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.

The submit ఈవీవీ సినిమా, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో నూతన చిత్రం first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.