జి.ఎస్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ప్రేమకథా చిత్రం “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి” జులై 31న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ద్వారా పవన్ మహావీర్ హీరోగా పరిచయమవుతున్నారు. జి. శైలజ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
ఈ చిత్రంలో వర్షిక, సుహానా కథానాయికలుగా నటిస్తుండగా.. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా అవుట్‌పుట్‌పై నిర్మాత శైలజ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో సినిమా బాగా వచ్చిందని, హీరోగా పవన్ మహావీర్‌కు మంచి గుర్తింపు వస్తుందని ఆమె పేర్కొన్నారు. జులై 31న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించగా, మహేందర్.ఎం ఛాయాగ్రాహకుడిగా బాధ్యతలు నిర్వహించారు. నందమూరి హరి ఎడిటర్‌గా, నందు ఫైట్ మాస్టర్‌గా వ్యవహరించారు. ధీరజ్-అప్పాజీ పి.ఆర్.ఓగా బాధ్యతలు చూస్తున్నారు.
The submit జులై 31న ‘అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి’ విడుదల first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
