Wed. Apr 22nd, 2026

ఇటీవల మలయాళ సినిమా అందుకున్న సంచలన విజయాత్మక చిత్రమే లోక చాప్టర్ 1 చంద్ర. దర్శకుడు డామినిక్ అరుణ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ క్రేజీ సూపర్ హీరో సినిమా తెలుగులో కొత్త లోక పేరిట విడుదలై మన దగ్గర కూడా మంచి వసూళ్లు అందుకుంది.

ఇక ఎట్టకేలకు ఈ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అందులో ఈ సినిమా ఇవాళ్టి నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. అప్పుడు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈసారి తప్పకుండా చూడవచ్చు. ఇక ఈ సినిమాలో శాండీ మాస్టర్, టోవినో థామస్ తదితరులు నటించగా దుల్కర్ సల్మాన్ నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The submit ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బ్లాక్ బస్టర్ ‘లోక చాప్టర్ 1’ first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.