సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ది రెడ్ బ్యాగ్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. యువ హీరో దినేష్ తేజ్, దర్శకుడు హరిప్రసాద్ ఈ పోస్టర్‌ను లాంచ్ చేసి చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఒక బ్యాగ్ చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికుమార్ సీరపు కథ, కథనం అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.
ఈ చిత్రంలో కబీర్ దుహన్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఈషాన్ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శేఖర్ మోపురి సంగీతం అందిస్తుండగా, ప్రియేష్ గురుసామి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కంటెంట్ బేస్డ్ చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
The put up ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథ.. ‘ది రెడ్ బ్యాగ్’ ఫస్ట్ లుక్ చూశారా? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
