Wed. Apr 22nd, 2026

ప్రముఖ నటుడు వెంకట్ హీరోగా నటించిన తాజా మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరుడు’. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వేసవి కానుకగా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా హీరో వెంకట్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తాను నటనతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో తనను యాక్షన్ హీరోగా అద్భుతంగా చూపించారని, గోవా, ముంబైలలో భారీ బడ్జెట్‌తో పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించామని చెప్పారు. అలాగే శ్రీహరి పైలా అనే కొత్త నటుడిని విలన్‌గా పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు. మే 8న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.

దర్శకుడు రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ.. వెంకట్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని, తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక హిట్ చేస్తారనే నమ్మకం ఉందని అన్నారు. పూరి జగన్నాథ్ వద్ద పనిచేసిన రాజ్.. ఆ టేకింగ్ మార్క్‌ను ఈ సినిమాలో చూపించారని ప్రముఖ నటుడు అలీ, చంద్రమహేష్ ప్రశంసించారు. మణి జిన్న సంగీతం, ఆనంద్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో నటీమణులు వేద్విక, లత తదితరులు పాల్గొన్నారు.

The publish ఘనంగా ‘హరుడు’ చిత్ర ట్రైలర్ లాంచ్.. మే 8న థియేటర్లలోకి.. first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.