ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కొన్నేళ్ల కితం స్టైలిష్ హీరో ట్యాగ్ నుంచి మాస్ లోకి కూడా అడుగు పెట్టేలా చేసిన పక్కా కమర్షియల్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది దర్శకుడు సురేందర్ రెడ్డి తో చేసిన సినిమా రేసు గుర్రం అనే చెప్పాలి. సాలిడ్ వసూళ్లు అప్పట్లోనే అందుకొని అల్లు అర్జున్ కెరీర్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది.
ఇక ఈ సినిమా ఫైనల్ గా ఈసారి బన్నీ బర్త్ డే కి రీరిలీజ్ కి రాగా మళ్లీ సాలిడ్ వసూళ్లు ఈ సినిమా అందుకుంది. ప్రీమియర్స్ సహా మొదటి రోజు కలిపి ఈ సినిమా 3.34 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు ఇప్పుడు తెలుస్తోంది. దీనితో ఈ సారి కూడా ఐకాన్ స్టార్ సత్తా చాటాడు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించారు అలాగే బెల్లంకొండ సురేష్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
The publish డే 1 కి గట్టి ఓపెనింగ్స్ అందుకున్న ‘రేసు గుర్రం’ రీరిలీజ్.. ఎంతంటే first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
