Wed. Apr 22nd, 2026

దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ కి సినిమా ఇండస్ట్రీలో మొదట సపోర్ట్ ఇచ్చింది హీరో ధనుషే. అందుకే, విఘ్నేశ్‌ శివన్‌ కి ధనుష్‌ అంటే ఎంతో గౌరవం. ఐతే, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విఘ్నేశ్‌ శివన్‌, ధనుష్ లో తన తండ్రిని చూసుకున్నానని చెప్పారు. విఘ్నేశ్‌ శివన్‌ మాట్లాడుతూ.. ‘నాకు ధనుష్‌ గారు అంటే అభిమానం. జులై 28 ఆయన పుట్టినరోజు. యాదృచ్ఛికంగా అదే రోజు మా నాన్న గారు పోయారు. దానివల్ల ధనుష్‌లోనే నేను మా నాన్నను చూసుకున్నాను’ అని విఘ్నేశ్‌ శివన్‌ తెలిపాడు.

విఘ్నేశ్‌ శివన్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘ఏది ఏమైనా తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే, దానికి ముఖ్య కారణం ఆయనే. ‘వి.ఐ.పి’ షూట్‌ సమయంలోనూ రెండేళ్లు ఆయనతోనే ఉన్నా. ఆయన తిన్నాకే తినేవాడిని. ఒకప్పుడు మా మధ్య అంత గొప్ప అనుబంధం ఉండేది. కానీ, కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఆ స్నేహం లేదు. అందుకు నేనెంతో సిగ్గుపడుతున్నా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనతో కలిసి ఉండాల్సింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. కానీ మా మధ్య అలాంటిది ఏమీ జరగలేదు’ అని విఘ్నేశ్‌ శివన్‌ అన్నారు.

The submit ధనుష్ తో గొప్ప అనుబంధం ఉండేదట ! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.