కోలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోస్ లో యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ కూడా ఒకరు. చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ వరుస 100 కోట్ల గ్రాస్ లు కొట్టాడు. అయితే ప్రదీప్ కి తమిళ్ తో పాటు తెలుగు వెరైన్ లలో కూడా దాదాపు సమానమైన వసూళ్లు ఉన్నాయి. మెయిన్ గా తన మొదటి సినిమానే తెలుగు ఆడియెన్స్ లో తనని దగ్గర చేసింది.
ఈ క్రెడిట్ మాత్రం యంగ్ హీరో ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి ఇచ్చేసాడు. లవ్ టుడే అనే సినిమాని రీమేక్ గా కాకుండా తెలుగులో డబ్బింగ్ చేసే విడుదల చేద్దామనే ఐడియా ఆయనదే అని అలా డబ్ చేసి విడుదల చేయడం వల్లే ఈరోజు తెలుగు ఆడియెన్స్ ముందు తను ఉన్నానని తెలిపాడు. సో అలా దిల్ రాజు ప్లాన్ ప్రదీప్ కి తెలుగులో సాలిడ్ మార్కెట్ ని అందించింది అని చెప్పొచ్చు.
The publish ప్రదీప్ రంగనాథన్ తెలుగు మార్కెట్.. దిల్ రాజుకు క్రెడిట్ first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
