మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన మాస్ చిత్రమే మాస్ జాతర. డీసెంట్ బజ్ నడుమ ఈ నవంబర్ 1న థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో రాణించలేకపోయింది. ఇక ఈ తర్వాత ఓటిటి రిలీజ్ పరంగా కూడా పలు చిక్కులు ఎదుర్కొన్నట్టు టాక్ కూడా వచ్చింది.
మరి వీటిని దాటి ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ని ఈ చిత్రం అందుకుంది. ఈ సినిమా ఓటిటి హక్కులు సొంతం చేసుకున్న దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ మాస్ జాతర రిలీజ్ డేట్ లాక్ చేశారు. ఈ నవంబర్ 28 నుంచి హిందీ మినహా మిగతా సౌత్ భాషల్లో ఈ సినిమాని అందుబాటులోకి తెస్తున్నట్టుగా ఖరారు చేశారు. సో ఇది రవితేజ అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.
The put up ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘మాస్ జాతర’ first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
The put up ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘మాస్ జాతర’ first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.