Wed. Apr 22nd, 2026

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది.

ఇక ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘బెల్ల బెల్ల’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ట్యూన్స్‌తో కంపోజ్ చేశారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా ఈ పాటలో మాస్ రాజా రవితేజ, అందాల భామ ఆషిక రంగనాథ్ మంచి స్టెప్స్‌తో ఆకట్టుకుంటున్నారు.

ఈ పాటకు సంబంధించిన పూర్తి లిరికల్ వీడియో సాంగ్ డిసెంబర్ 01న ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో మరో అందాల భామ డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తోండగా ఎల్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The submit ‘బెల్ల బెల్ల’ సాంగ్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ చేసిన మాస్ రాజా first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.