ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ తమ నాలుగో తమిళ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. యువ నటుడు ధృవ్ విక్రమ్ హీరోగా, కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
చెన్నైలోని మైత్రీ ఆఫీస్‌లో జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమానికి హీరో ధృవ్ విక్రమ్ స్టైలిష్ లుక్‌లో హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌కు దర్శకుడు కీర్తీశ్వరన్ క్లాప్ కొట్టగా.. అధిక్ రవిచంద్రన్, రవికుమార్, ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ వంటి పలువురు ప్రముఖ దర్శకులు విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పటివరకు వైవిధ్యమైన పాత్రలు చేసిన ధృవ్ విక్రమ్, ఈ సినిమాతో మొదటిసారి కమర్షియల్ మాస్ అవతారంలో అలరించనున్నారు. ఈ చిత్రానికి సబీ స్క్రీన్‌ప్లే అందించగా.. విక్కీ (సినిమాటోగ్రఫీ), జయసూర్య (ఎడిటింగ్), విక్రమ్ మోర్ (యాక్షన్) వంటి ప్రతిభావంతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది.
The submit మైత్రి వారి నాలుగో తమిళ ప్రాజెక్ట్.. హీరో ఎవరంటే..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
