Wed. Apr 22nd, 2026

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ‘రామాయణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా స్పెషల్‌ గ్లింప్స్‌పై కొందరు విమర్శలు చేశారు. తాజాగా హృతిక్‌ రోషన్‌ ఆ విమర్శల పై స్పందిస్తూ.. ‘‘కల్కి 2898 AD’, ‘బాహుబలి’, ‘రామాయణ’, ‘కోయి మిల్ గయా’, ‘క్రిష్‌’ చిత్రాల దర్శకులు నా హీరోలు. మునుపెన్నడూ చూడని అద్భుతమైన చిత్రాలను రూపొందించాలనే ధైర్యం, దార్శనికత వారిలో ఉంది. కాబట్టి, వాళ్ల అభిప్రాయాన్ని, ఆలోచనలను మనం గౌరవించాలి’ అని హృతిక్‌ రోషన్‌ తెలిపాడు.

నితీశ్‌ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’ సిద్ధమవుతోంది. రాముడు, పరశురాముడి పాత్రల్లో రణ్‌బీర్‌ కనిపించనున్నారు. సీతమ్మగా సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ సినీ నిర్మాణంలో భాగం కావడమే కాకుండా రామాయణంలో కీలకమైన రావణాసురుడి పాత్రలో యశ్‌ యాక్ట్‌ చేస్తున్నారు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ఇటీవల చిత్రబృందం ‘రామాయణ’ స్పెషల్‌ గ్లింప్స్‌ విడుదల చేసింది. రాముడి లుక్‌ను పరిచయం చేసింది. వీడియో చూసిన పలువురు నెటిజన్లు.. వీఎఫ్‌ఎక్స్‌పై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. వేరే సినిమాతో దీని పోల్చి చూస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.

The submit ‘రామాయణ’ పై విమర్శలకు హృతిక్‌ జవాబు ! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.