టాలీవుడ్ యంగ్ హీరోలో కిరణ్ అబ్బవరం ఒకరు. హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. చివరగా.. ‘క’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘కె-ర్యాంప్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ‘చెన్నై లవ్ స్టోరీ’ షూటింగ్లో పాల్గొంటున్నారు. అంతే కాకుండా లైన్ లో ఇంకా పలు సినిమాలు ఉన్నాయట.
Also Read : Rukmini Vasanth : నా కెరీర్లో ప్రత్యేక పాత్ర ఇదే
అయితే, ఇప్పుడు కిరణ్ అబ్బవరంపై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే ఆయన స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి పనిచేయబోతున్నారని సమాచారం. కానీ ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏమిటంటే.. ఈ సినిమా డైరెక్టర్ స్వయంగా సుకుమార్ కాదు, ఆయన శిష్యుడు వీర. ఈ ప్రాజెక్ట్‌ను సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నిర్మించబోతున్నారు. అంటే ఈ సినిమాకు సుకుమార్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. ఇది ఒక మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనుందని, వచ్చే ఏడాది ఆరంభంలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
