
యాంకర్‌గా మరియు నటిగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించిన విష్ణుప్రియ (Vishnu Priya), బిగ్ బాస్ తర్వాత మరింత క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ మధ్య కాలంలో టీవీ షోస్ లో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ (TV Shows) వంటి ప్రోగ్రామ్స్‌లో బిజీగా కనిపిస్తోంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఆమె పేరు లవ్, డేటింగ్, రిలేషన్‌షిప్ అంశాలతో మీడియాలో తరచూ వినిపిస్తోంది.
ఇటీవల ఆమె సీరియల్ నటుడు పృథ్వీ (Serial Actor Prithvi)తో బంధం గురించి తెరవిగా మాట్లాడింది. ఒక ఇంటర్వ్యూలో, “పృథ్వీ నాకు మంచి ఫ్రెండ్. అతనితో మంచి బాండింగ్ ఉంది. అతను పక్కన ఉంటే నేను హ్యాపీగా ఫీలవుతాను” అని చెప్పింది. కిరాక్ బాయ్స్ షోకు మళ్లీ రావడానికి కారణం కూడా పృథ్వీనే అని చెప్పింది.
తన ప్రేమ జీవితం గురించి మాట్లాడుతూ, విష్ణుప్రియ, “ప్రస్తుతం నేను సింగిల్ (Single). కానీ మింగిల్ అవ్వడానికి రెడీ (Ready)గా ఉన్నాను. పృథ్వీ ప్రపోజ్ చేస్తే మాత్రం ఓకే చెప్తాను. గత రిలేషన్‌షిప్‌లో కొన్ని తప్పులు జరిగాయి. కాబట్టి ఇప్పుడు కూల్‌గా ఆలోచిస్తున్నాను” అని వెల్లడించింది.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్నాయి. మరి ఈ కామెంట్స్‌పై పృథ్వీ ఎలా స్పందిస్తాడో చూడాలి. టీవీ ప్రేమ జంటగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న ఈ బంధం నిజంగా ప్రేమగా మారుతుందా అన్నది ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది.