మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో భారీ సక్సెస్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ నుంచి దాని కంటే ముందే మొదలైన భారీ ఫాంటసీ సినిమా విశ్వంభర కూడా ఒకటి. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడో రావాల్సిన సినిమా. కానీ ఇప్పటికీ రాలేదు. మేకర్స్ ఈ ఏడాది వేసవి నుంచి జూలై కి షిఫ్ట్ చేశారు.
కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం సినిమా అప్పుడు కూడా వచ్చే ఛాన్స్ లేదనే వినిపిస్తోంది. సో విశ్వంభర కోసం ఎదురు చూపులు మరింత ఎక్కువ కానున్నాయి. ఆల్రెడీ లేట్ అవుతున్న సినిమాల విషయంలో అభిమానులే అంతగా ఆసక్తి చూపడం లేదు. మరి వీటిపై మేకర్స్ కూడా దృష్టి సారించాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ తదితరులు నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
The put up “విశ్వంభర” మరింత ఆలస్యం!? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
