Sat. Jul 25th, 2026

ప్రముఖ హాలీవుడ్ హీరో మన తెలుగు ఆడియెన్స్ ముద్దుగా పిలుచుకునే ఉరుముల దొర క్రిస్ హేమ్స్ వోర్త్ హీరోగా నటించిన గ్లోబల్ హిట్ చిత్రాల్లో ‘ఎక్సట్రాక్షన్’ కూడా ఒకటి. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ క్రేజీ యాక్షన్ ప్రాజెక్ట్ కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఓటిటి వీక్షకులకు క్రేజీ ట్రీట్ ని అందించింది.

దీనితో మేకర్స్ పార్ట్ 2 కూడా తీసి హిట్ కొట్టారు. ఇక మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అధికారికంగా మూడో ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. తాజాగా ‘థోర్’ హీరో అలాగే నెట్ ఫ్లిక్స్ వారు కలిసి అధికారికంగా ‘ఎక్సట్రాక్షన్’ మూడో పార్ట్ కి నాంది పలికినట్టు తెలిపారు.

హీరో క్రిస్ హేమ్స్ వోర్త్, రీసెంట్ గా వచ్చిన హాలీవుడ్ చిత్రం హీ మ్యాన్ నటుడు ఐడ్రిస్ ఎల్బా అలాగే గత రెండు సినిమాలని తెరకెక్కించిన దర్శకుడు సామ్ హర్ గ్రేవ్ లు కలిపి ఉన్న పిక్ ని నెట్ ఫ్లిక్స్ షేర్ చేసి ఎక్సట్రాక్షన్ పార్ట్ 3 ని చేస్తున్నట్టు తెలిపారు. దీనితో యాక్షన్ మూవీ లవర్స్ కి మాత్రం ఇది బిగ్ అప్డేట్ అని చెప్పాల్సిందే. ఇక ఈ సినిమాని ఎప్పుడు విడుదలకి తీసుకొస్తారో చూడాలి.

The put up Extraction 3: ఉరుముల దొర ఓటిటి సెన్సేషన్ కి మూడో పార్ట్.. అఫీషియల్ గా ప్రకటన! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.