రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో విరాట్ కర్ణ నటించిన చిత్రం ‘నాగ బంధం’ కూడా ఒకటి. దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ భారీ పీరియాడిక్ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ లు ఫీమేల్ లీడ్ లో నటించారు. రిలీజ్ కి ముందు సాలిడ్ హైప్ ని థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఒకింత మిక్స్డ్ స్పందన అందుకుంది.
అయితే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం బాగానే రాబట్టేసింది. ఇక అక్కడ నుంచి కేవలం మూడే వారాల్లో ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఇవాళ్టి నుంచి సినిమా అందుబాటులోకి వచ్చేసింది. హిందీ మినహా మిగతా భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా అప్పుడు మిస్ అయ్యి ఓటిటిలో చూడాలి అనుకునేవారు ఇప్పుడు అందులో చూడొచ్చు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
The put up ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘నాగ బంధం’.. ఎందులో అంటే! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
