Sat. Jul 25th, 2026

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బెనాక గోల్డ్’ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, సంస్థ బ్రాండ్ అంబాసిడర్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బెనాక గోల్డ్ ఫౌండర్ భరత్ కుమార్ ఎస్, సంస్థ యాజమాన్యం మరియు సిబ్బందికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

పేద, మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడేలా అత్యుత్తమ సేవలందిస్తున్నందుకే ఈ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు అంగీకరించానని నాగబాబు వెల్లడించారు. ఆపదలు, అత్యవసర సమయాల్లో వేరే చోట కుదవబెట్టిన బంగారాన్ని విడిపించి, మార్కెట్ విలువ ప్రకారం సరైన ధర కట్టడమే కాకుండా.. ఆ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో (ఇన్స్టాల్‌మెంట్స్) చెల్లించే వినూత్న సౌకర్యాన్ని ‘బెనాక గోల్డ్’ కల్పిస్తోందని ఆయన వివరించారు.

కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంస్థను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని వ్యవస్థాపకుడు భరత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ ఆవుల మాట్లాడుతూ, ఈ సంస్థకు సంబంధించిన యాడ్ షూట్‌లో నాగబాబుతో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా అనిపించిందని పేర్కొన్నారు. 

The submit హైదరాబాద్‌లో ‘బెనాక గోల్డ్’ వార్షికోత్సవం.. ముఖ్య అతిథిగా హాజరైన నటుడు నాగబాబు first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.