Wed. Apr 29th, 2026
Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో టాప్ డైరెక్టర్ల జాబితా తీస్తే రాజమౌళి, సుకుమార్ సరసన వినిపిస్తున్న పేరు ఆదిత్య ధర్. ఫాంటసీ, గ్రాఫిక్స్ హంగులు లేకుండా కేవలం గ్రిప్పింగ్ స్పై డ్రామాతో ‘ధురంధర్’ సిరీస్‌ను ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టిన ఆయన, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు. అందరూ ఊహించినట్లుగానే ఆయన మళ్లీ తన లక్కీ హీరో రణవీర్ సింగ్‌తోనే జతకట్టబోతున్నారు. ముంబై ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఆదిత్య ధర్ ఇప్పటికే తన తదుపరి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2027 మార్చి నుండి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు రాబోయే సినిమా అంతకు మించి ఉంటుందని టాక్. దేశంలోని అగ్ర తారలందరూ ఆదిత్య ధర్‌తో పనిచేయాలని ఉవ్విళ్లూరుతున్నా, ఆయన మాత్రం కథకు తగిన నటీనటులనే ఎంపిక చేస్తానని స్పష్టం చేశారు. ‘ధురంధర్: ది రివెంజ్’ సాధించిన విజయం ఆదిత్య ధర్ ను గ్లోబల్ లెవల్ డైరెక్టర్ గా నిలబెట్టింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, ఇంటెన్స్ డ్రామాతో రూపొందిన ఈ చిత్రం బాహుబలి 2 రికార్డులను సైతం టచ్ చేయడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇప్పుడు రణవీర్ తో చేయబోయే మూడో సినిమా ఏ స్థాయి రికార్డులను క్రియేట్ చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.