Wed. Apr 22nd, 2026
Karuppu : సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న కోలీవుడ్ స్టార్..!

కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం తన కెరీర్‌లో చాలా కచ్చితమైన ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు. భారీ విజువల్ ఎక్స్‌పెరిమెంట్‌గా తెరకెక్కిన “కంగువ” తర్వాత ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో తన 46వ సినిమాను చేస్తూ తెలుగు మార్కెట్‌కీ దగ్గరవుతున్నాడు. మరోవైపు, కంటెంట్‌ ఓరియెంటెడ్ సినిమాలకూ సమాన ప్రాధాన్యం ఇస్తూ తనదైన శైలిలో బ్యాలెన్స్‌ చూపిస్తున్నాడు. ఆ లైన్‌లోనే వస్తున్న అతని లేటెస్ట్ ప్రాజెక్ట్‌ “కరుప్పు”, దీనికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా, ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ బయటకు వచ్చింది.

Additionally Learn : Mamitha Baiju: సినిమా నా జీవితాన్ని మార్చేసింది – మమిత బైజు ఎమోషనల్‌ రివీల్‌

ఇండస్ట్రీ టాక్ ప్రకారం, “కరుప్పు” మూవీని 2026 జనవరి 23 (శుక్రవారం) రిలీజ్ చేయాలని టీమ్‌ ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది. అయితే 2026 సంక్రాంతి సీజన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన పెద్ద యుద్ధం జరగనుంది. ప్రభాస్‌ “రాజా సాబ్”, చిరంజీవి “మన శంకర వర ప్రసాద్”, విజయ్‌ “జన నాయకుడు”, రవితేజ “RT76”, నవీన్‌ పొలిశెట్టి “అనగనగా ఒక రాజు”.. ఇలా భారీ స్టార్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇంత హై వోల్టేజ్ కాంపిటీషన్‌లో రిలీజ్ చేయడం కంటే, కాస్త వెనక్కి వెళ్లడం మంచిదని సూర్య టీమ్ నిర్ణయించుకుంది. అందుకే, సంక్రాంతి రేస్‌కు వారం గ్యాప్ ఇచ్చి జనవరి 23న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇది చాలా స్మార్ట్ స్టెప్. ఎందుకంటే..

ఆ తర్వాత సోమవారం జనవరి 26 రిపబ్లిక్ డే హాలిడే వస్తుంది. అంటే, శుక్రవారం నుంచి సోమవారం వరకు నాన్‌స్టాప్‌గా 4 రోజుల లాంగ్ ఓపెనింగ్ వీకెండ్ దొరుకుతుంది. ఇది సాధారణంగా పెద్ద సినిమాలకు దొరకని గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. సంక్రాంతి సినిమాల లాగా కాంపిటీషన్ లేకుండా, హాలిడే కలెక్షన్లను సోలోగా బుక్ చేసుకునే అవకాశం వస్తుంది. ఏమాత్రం మంచి మౌత్‌టాక్ వచ్చిన, ఈ 4 రోజుల లాంగ్ వీకెండ్‌లో “కరుప్పు” బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం. మొత్తానికి, సూర్య ఒకవైపు పాన్ ఇండియా మార్కెట్ కోసం బలంగా ప్రయత్నిస్తూనే, మరోవైపు స్ట్రాటజిక్ రిలీజ్ ప్లానింగ్తో తెలివిగా అడుగులు వేస్తున్నాడు. ఈ రిపబ్లిక్ డే గ్యాప్ స్ట్రాటజీ వర్కౌట్ అయితే,“కరుప్పు”తో సూర్య ఖాతాలో మరో సాలిడ్ బ్లాక్‌బస్టర్ చేరడం ఖాయం.