Wed. Apr 22nd, 2026
Nag Ashwin: ‘ధురందర్ 2’ సక్సెస్‌పై..నాగ్ అశ్విన్ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు నాగ్ అశ్విన్ మరోసారి తన హుందాతనాన్ని చాటుకున్నారు. వ్యక్తిగత విభేదాల కంటే సినిమానే గొప్పదని నిరూపిస్తూ, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘ధురందర్ 2’ చిత్రాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను, రణవీర్ సింగ్ అద్భుత నటనను ప్రశంసిస్తూ నాగ్ అశ్విన్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Additionally Learn : Bunny Vas: మలయాళం వేరు.. తెలుగు వేరు.. కొత్త నిర్మాతలకు బన్నీ వాస్ స్వీట్ వార్నింగ్!

కేవలం భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రమే కాకుండా, ఈ సినిమాలో ఉన్న ఎమోషనల్ డెప్త్ తనను కదిలించిందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. ముఖ్యంగా సినిమా ఆరంభంలో క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.. ‘తల్లి కౌగిలింత లేదా ఆ ప్రేమ కోసం పడే తపన.. ప్రేక్షకుడి గుండెను బలంగా హత్తుకుంటాయి’ అని ఆయన చెప్పుకొచ్చారు. కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా కథలో ఉన్న ఎమోషన్ వల్లే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిందని నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. హీరో రణవీర్ సింగ్ గురించి మాట్లాడుతూ.. ఆయన తన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తారని, ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారని నాగ్ అశ్విన్ కొనియాడారు. మొత్తనికి భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘ధురందర్ 2’ టీమ్ మొత్తానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.