Wed. Apr 22nd, 2026
Ram Pothineni New Movie: డైరెక్టర్ వేటలో రామ్ పోతినేని.. ఎప్పటికి దొరికేనో!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. రామ్ కొత్త సినిమా పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్.. కొత్త ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది.

రామ్ పోతినేని స్వయంగా ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నారట. ఇప్పుడు ఆ కథను ఓన్ చేసుకొని, దాన్ని పర్ఫెక్ట్‌గా ఆవిష్కరించే దర్శకుడి కోసం ఆయన వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. తన ఆలోచనలకు తగ్గట్టుగా మేకింగ్ చేయగల టాలెంటెడ్ డైరెక్టర్ దొరికితేనే ముందుకు వెళ్లాలని రామ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి గత కొద్దిరోజులుగా లోకేష్ కనగరాజ్ శిష్యుడు విఘ్నేష్ దర్శకత్వంలో రామ్ కొత్త సినిమా చేయబోతున్నట్టుగా ప్రచారం జోరుగా సాగింది. వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని, ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైందని అందరూ భావించారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం విఘ్నేష్‌ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది.

Additionally Learn: NTR Birthday: ఒకటి రెండు కాదు, ఏకంగా నాలుగు.. ఈసారి ఎన్టీఆర్ బర్త్ డే అదిరిపోద్ది!

ఇప్పుడు రామ్ తన కథ కోసం డైరెక్టర్ వేటలో ఉన్నట్టుగా ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. రామ్ లాస్ట్ ఫిల్మ్ ఆంధ్రా కింగ్ తాలుకాలో రైటర్ అవతారమెత్తి ఓ పాట కూడా రాశాడు. ఇప్పుడు తన కోసం తనే కథ సిద్ధం చేసుకోవడం చూస్తుంటే.. రామ్ తనలోని రైటర్‌ను పూర్తిగా బయటికి తీస్తున్నాడనే చెప్పాలి. మరి రామ్ రాసుకున్న కథను హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.